ఏటీఎం చోరీకి యత్నం.. యువకుడికి దేహశుద్ధి | Man Arrested For ATM Robbery In Nalgonda | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి యత్నం.. యువకుడికి దేహశుద్ధి

Jul 3 2019 8:09 AM | Updated on Jul 3 2019 8:30 AM

Man Arrested For ATM Robbery In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : జిల్లాలోని చండూర్‌ మండలం ఘట్టుప్పల్‌లో ఏటీఎంలోని నగదు చోరికి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఓ యువకుడు. గడ్డపారతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేస్తుండగా గ్రామస్తులు చూసి పోలీసులకు పట్టించారు. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వాయులపల్లి గ్రామానికి చెందిన జలందర్‌ ఘట్టుప్పల్‌లోని ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు దొంగతనం చేయాలని పథకం పన్నాడు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గడ్డపార, సుత్తె, కొడవలితో ఏటీఎం మిషన్‌ వద్దకు వచ్చాడు.

ఆయుధాలతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేయడానికి యత్నించాడు. శబ్దం రావడంతో పక్కనే ఉన్న కొంతమంది యువకులు ఏటీఎం వద్దకు వెళ్లి చూశారు. దొంగతనానికి పాల్పడుతున్న జలందర్‌ను చూసిన యువకులు గ్రామస్తులకు ఫోన్‌ చేసిన విషయం చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి జలందర్‌ను బంధించారు. గ్రామస్తులను చూసి బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన జలందర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జలందర్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement