నగ్న ఫొటోలతో భార్యకు నరకం! | Husband Posts Wife Nude Photos In Panchkula | Sakshi
Sakshi News home page

నగ్న ఫొటోలతో భార్యకు నరకం!

Apr 6 2018 5:17 PM | Updated on Jul 23 2018 8:49 PM

Husband Posts Wife Nude Photos In Panchkula - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు

పంచకుల : మతం మారనందుకు ఓ వివాహితకు భర్త నరకం చూపిస్తున్నాడు. ఎంతలా అంటే.. నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. తనకు నరకం నుంచి విముక్తి కల్పించాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో చోటుచేసుకుంది. పంచకుల పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఓ హిందూ యువతికి స్థానిక ముస్లిం యువకుడితో వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇస్లాం మతంలోకి మారాలంటూ భార్యను ఆ యువకుడు వేధిస్తున్నాడు. అయినా ఆమె ఒప్పుకోకపోలేదు.

ఆవేశానికి లోనైన భర్త, తన స్నేహితుడితో కలిసి భార్యను నగ్నంగా ఫొటోలు తీశాడు. అయినా ఆమె మతం మారేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన నిందితులు వివాహిత అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వేధింపులు ఇక భరించలేనంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మతం మారకపోతే విడాకులు ఇస్తానని కూడా భర్త వేధించేవాడని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement