ఎంబీబీఎస్‌ విద్యార్థినిపై అత్యాచారం! | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ విద్యార్థినిపై అత్యాచారం!

Published Thu, Dec 21 2017 4:57 AM

First year MBBS student raped in Bhubaneswar medical college campus - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాల క్యాంపస్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థినిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి హాస్టల్‌కు వెళ్తుండగా ప్యూన్‌ బలాత్కారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదుచేయడంతో కుంతియా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను అమాయకుడినని, తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని నిందితుడు అన్నాడు. ‘రాత్రి భోజనం ముగించుకుని క్యాంటీన్‌ నుంచి తిరిగొస్తుండగా ఆ విద్యార్థిని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకర స్థితిలో ఉండగా చూశాను. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్తానని బెదిరించాను. ఎవరికీ చెప్పొద్దని, కాలేజ్‌ క్యాంపస్‌లో మళ్లీ ఇలాంటి తప్పు చేయమని బతిమిలాడటంతో నేను అక్కడి నుంచి వెళ్లిపోయా. కానీ బుధవారం తెల్లవారుజామున పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు’ అని కుంతియా వివరించాడు.  

Advertisement
Advertisement