ఆవుతో అసహజ శృంగారం : నిందితుడి అరెస్ట్‌ | Cow Raped By Elderly Man In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఆవుతో అసహజ శృంగారం : నిందితుడి అరెస్ట్‌

Aug 6 2018 5:40 PM | Updated on Oct 8 2018 3:19 PM

Cow Raped By Elderly Man In Madhya Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన..

భోపాల్‌ : హర్యానాలోని మెవాత్‌ జిల్లాలో మేకపై సామూహిక లైంగిక దాడి అనంతరం మధ్యప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌గఢ్‌ జిల్లా సుతాలియా ప్రాంతంలో ఆవుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి స్ధానిక వ్యాపారి ఇంటికి తిరిగివస్తుండగా ఆవుపై ఓ ప్రబుద్ధుడు ఈ అసహజ లైంగిక దాడికి పాల్పడటం గమనించారు. నిందితుడిని ఛోటేఖాన్‌గా గుర్తించారు.

గ్రామంలోని దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఛోటేఖాన్‌ దురాగతాన్ని తాను చూశానని, అతడిని వారించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రధాన నిందితుడి పక్కే మరికొందరు చోద్యం చూస్తూ ఉన్నారని వ్యాపారి మహేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

ఈ ఘటనకు నిరసనగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్ధానికులకు హామీ ఇచ్చారు. నిందితుడు ఛోటే ఖాన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement