కంపెనీ వేధింపులు తాళలేక చనిపోతున్నా... ! | CMS Info Systems Employee Suicide Hyderabad | Sakshi
Sakshi News home page

కంపెనీ వేధింపులు తాళలేక చనిపోతున్నా... !

Dec 19 2018 2:07 PM | Updated on Dec 19 2018 2:23 PM

CMS Info Systems Employee Suicide Hyderabad - Sakshi

నూతలగంటి నర్సింగ్ ఫెల్‌ పోటో

సాక్షి, హైదరాబాద్‌: కంపెనీ వేధింపులు తాళలేక నూతలగంటి నర్సింగ్(30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో నూతలగంటి నర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం రోజులుగా తనకు యాజమాన్యం నుంచి వేధింపులు మొదలయ్యాయని, తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకొన్నాడు.

నర్సింగ్‌ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం వేధింపులతోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని, నర్సింగ్‌ మృతదేహంతో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆఫీస్‌ కార్యలయం ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు.

1
1/1

సూసైడ్ నోట్

Advertisement
 
Advertisement
Advertisement