వ్యభిచారం కేసులో బ్యూటీషియన్‌..  | Beautician Arrested In Prostitution Case At Banjarahills Road No 12 | Sakshi
Sakshi News home page

Jun 2 2018 9:48 AM | Updated on Sep 4 2018 5:48 PM

Beautician Arrested In Prostitution Case At Banjarahills Road No 12 - Sakshi

బంజారాహిల్స్‌ : బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎన్బీటీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించి నిర్వాహకుడితో పాటు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఎన్బీటీ నగర్‌లో గత కొంత కాలంగా షేక్‌ ముజుమిల్‌ రెహమాన్‌ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్లు  సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు రెహమాన్‌తో పాటు గాంధీనగర్‌ దేవిచౌక్‌ ప్రాంతానికి చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు.

బ్యూటీషియన్‌గా పని చేస్తున్న తాను నెలకు రూ.15 వేలు కూడా సంపాదించలేకపోతున్నానని ప్రతినెలా రూ. 50 వేలు ఇస్తానని రెహమాన్‌ చెప్పడంతో ఆరు నెలల క్రితం ఈ వృత్తిలోకి దిగినట్లు తెలిపింది. నిర్వాహకుడు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది. నిందితుడు రెహమాన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతిని పునరావాసకేంద్రానికి తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
  

Advertisement
 
Advertisement
Advertisement