ఇది మోసాల పాలన

ys jagan padayatra in chittoor district - Sakshi

ఎటు చూసినా లంచాలే లంచాలు 

రాజకీయాల్లో విశ్వసనీయత పెరగాలి

చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయాలి

బాబు గారి పాలనలో సంతోషంగా ఉన్న వారే కరువు

సొంత గడ్డపై చంద్రబాబుకు తపన లేదు

రామచంద్రాపురం బహిరంగసభలో వైఎస్‌ జగన్‌

అభిమాన నాయకుడు వైఎస్‌ జగన్‌ వస్తున్నాడని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా రామచంద్రాపురం తరలివచ్చారు. పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. సీ రామాపురం, నెన్నూరు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్‌ జగన్‌ ప్రసంగం పూర్తయ్యే వరకూ జనం కదల్లేదు. వైఎస్‌ఆర్‌ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ జనంలోంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. 
                                         

సాక్షి ప్రతినిధి, తిరుపతి : 
‘‘ఈ వ్యవస్థ మారాలి. అవినీతి, మోసాలతో కూడిన రాజకీయాలు తగ్గాలి. రాజకీయాల్లో విశ్వసనీయత పెరగాలి. ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చలేని నాయకుడు ఎవరైనా సరే..తన∙పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయే రోజులు రావాలి. ఇది  జగన్‌ ఒక్కడి వల్లనే సాధ్యం కాదు. మీరంతా నాకు తోడూ నీడగా నిలబడాలి. చల్లని మనస్సుతో ఆశీర్వదించాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి కంకణం కట్టుకున్న మీ బిడ్డకు అండగా నిలబడాలి. లక్ష్యం నెరవేరేలా సహకరించా లని.. విపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముకుళిత హస్తాలతో ప్రజలను కోరారు. శనివారం సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విపక్షనేత వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

సొంత జిల్లాను, సొంతూరున్న చంద్రగిరి నియోజకవర్గ ప్రగతిని పట్టించుకోని సీఎం చంద్రబాబు రాష్ట్రాన్నేం ఉద్దరిస్తారని విమర్శించారు. నియోజకవర్గంలో 138 పంచాయతీలుండగా 70 శాతం గ్రామాల్లో నేటికీ తాగునీటి సమస్య తాండవిస్తోందన్నారు. చంద్రగిరి, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఏనుగుల దాడులు పెరిగి పంట పొలాలు దెబ్బతింటున్న ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇప్పించారా అని ప్రశ్నించారు. దారుణమైన మోసాలతో ఉన్న ఉద్యోగాలన్నీ ఊడబెరికే పనులు చేస్తున్న చంద్రబాబు పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 

పాదయాత్ర సాగిందిలా...
శనివారం ఉదయం 8.30 గంటలకు కుప్పం బాదూరు నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాంలతో పావుగంట పాటు మాట్లాడిన వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ఉపక్రమించారు. తిరుపతి నుంచి వచ్చిన పార్టీ నేతలు పెంచలయ్య, బండ్ల లక్ష్మీపతి, బాలిశెట్టి కిషోర్, గణేష్‌ నిరుద్యోగ భృతి విషయంలో సీఎం చంద్రబాబు చేసిన మోసాలను గుర్తు చేస్తూ రూ.2 వేల నోటుతో తయారు చేసిన టోపీలను వైఎస్‌ జగన్‌కు అందజేశారు. కుప్పం బాదూరులోని పలువురు మహిళలు జగన్‌ను కలిసి పింఛన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బార్‌ అసోసియేషన్‌ సభ్యులైన న్యాయవాదులు పలువురు కలిసి ప్రజా సంకల్పయాత్రకు మద్దతు పలికి తమ సమస్యలను వివరించారు.

రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సేవా సమితి నాయకులు వైఎస్‌ జగన్‌ను కలిసి రాజకీయంగా తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత అవసరమని కోరారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ కంకణాల రత్నయ్య వైఎస్‌ జగన్‌ను కలిసి కొంతసేపు పాదయాత్ర చేశారు. దళిత మహాజన సంఘం నాయకులు వైఎస్‌ జగన్‌ను కలిసి ఎస్సీ వర్గీకరణ అంశం 24 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉందని, ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు. ఒడ్డుకాల్వ ప్రాంతంలో జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ నాయకులు వైఎస్‌ జగన్‌ను కలిసి ఇళ్లు, ప్రత్యేక రాయితీలపై వినతిపత్రం అందజేశారు. యూఎస్‌ఏలోని సార్లెట్‌ నుంచి మదన్‌మోహన్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి వచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు.  
 

More news

19-01-2018
Jan 19, 2018, 10:33 IST
అడుగు..అడుగూ ఏకమవుతోంది. పల్లెపల్లె కదలి వస్తోంది. చిన్నాపెద్దా..ముసలీముతకా చేయిచేయి కలిపి సంకల్ప యాత్రలో భాగస్వాములవుతున్నారు. తమ సమస్యలు ఆలకించేందుకు వచ్చిన...
19-01-2018
Jan 19, 2018, 09:50 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి  సాక్షి ప్రత్యేక ప్రతినిధి   : ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ.. అందరూ సర్కారు బాధితులే.. తమ...
19-01-2018
Jan 19, 2018, 02:53 IST
65 వ రోజు 18–01–2018, గురువారం సదాశివపురం క్రాస్,  చిత్తూరు జిల్లా ఉదయం శిబిరం నుంచి వెలుపలికి రాగానే ఆరోగ్యశ్రీ సేవలు అందని మరో విషాద...
18-01-2018
Jan 18, 2018, 13:38 IST
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదల పట్ల,...
18-01-2018
Jan 18, 2018, 13:08 IST
సాక్షి, శ్రీకాళహస్తి: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌...
18-01-2018
Jan 18, 2018, 08:53 IST
సాక్షి, చిత్తూరు: రాజన్న బిడ్డ చేపట్టిన యాత్రలో అడుగు వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష...
18-01-2018
Jan 18, 2018, 03:14 IST
అన్నా..! మేం గుడిసెలో ఉంటున్నాం. పక్కా ఇల్లు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఎలకండ్రిగకు చెందిన...
18-01-2018
Jan 18, 2018, 03:06 IST
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చట్టసభల్లో ప్రతి కులానికీ ప్రాతిని ధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం...
18-01-2018
Jan 18, 2018, 02:56 IST
‘అన్నా..! మాకు ఇద్దరు పిల్లలు. మేనరికం చేసుకున్నాం. పెద్దోడికి పదేళ్లు. పాపకు తొమ్మిదేళ్లు. ఇద్దరికీ మాటలు రావు. చెవులు వినిపించట్లేదు....
18-01-2018
Jan 18, 2018, 02:54 IST
64వ రోజు 17–01–2018, బుధవారం వికృతమాల,  చిత్తూరు జిల్లా. పరిపాలించే నాయకుడు స్వార్థపరుడైతే, అవినీతిపరుడైతే.. ఒక రాష్ట్రం ఎంతగా నష్టపోతుందో, తన ఒక్కడి స్వార్థం కోసం...
18-01-2018
Jan 18, 2018, 02:53 IST
‘సార్‌..! 25 ఏళ్లుగా మాకిచ్చిన బీడు భూముల్ని కష్టపడి సేద్యపు పొలాలుగా చేసుకున్నాం. ఇప్పుడు మా భూముల్లో పోలీసు ట్రైనింగ్‌...
18-01-2018
Jan 18, 2018, 02:48 IST
‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో బ్యాంక్‌కు వెళితే ఎంతో గౌరవం దక్కేది. అడిగినంత రుణం ఇచ్చేవారు. ఇప్పుడు బ్యాంక్‌ అధికారులు...
18-01-2018
Jan 18, 2018, 02:45 IST
‘సార్‌..! జిల్లాలో సహకార డెయిరీని ఎలాగైతే మూసేసి హెరిటేజ్‌ను డెవలప్‌ చేసుకున్నారో.. ఇప్పుడు మామిడి రైతుల్ని అలాగే దోచేస్తా ఉండారు....
18-01-2018
Jan 18, 2018, 02:41 IST
‘సార్‌..! మా ఇంటాయన చనిపోయి సంవత్సరం అవతా ఉండాది. ముగ్గురు పిల్లలున్నారు. పింఛన్‌ అడిగితే ఎవరూ ఇవ్వలేదు. కూలి చేస్తేనే...
18-01-2018
Jan 18, 2018, 01:03 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల వారు చట్టసభల్లో తమ వాణి వినిపించేలా చూస్తానని...
17-01-2018
Jan 17, 2018, 20:17 IST
సాక్షి, చిత్తూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 64వ రోజు ముగిసింది. బుధవారం...
17-01-2018
Jan 17, 2018, 18:58 IST
సాక్షి, పాపానాయుడుపేట : ‘‘మహానేత వైఎస్సార్‌ బతికున్నప్పుడు బీసీలందరికీ ఒక భరోసా ఉండేది. ఇంటికి ఒక్కరైనా డాక్టరో, ఇంజనీరో అయితే...
17-01-2018
Jan 17, 2018, 16:01 IST
సాక్షి, నెల్లూరు : ఈ నెల 23 నుంచి నెల్లూరు జిల్లాలో  ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు...
17-01-2018
Jan 17, 2018, 09:15 IST
సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారానికి 64వ...
17-01-2018
Jan 17, 2018, 05:48 IST
తిరుపతి రూరల్‌ : చంద్రగిరి నియోజకవర్గం రావిళ్లవారిపల్లెలో సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు....
Back to Top