షావోమి మరో స్మార్ట్‌టీవీ లాంచ్‌

Xiaomi Mi TV 4 with 65-inch 4K HDR display launched - Sakshi

65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీతో ఎంఐ టీవీ

సాక్షి,  న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఇంటా బయటా దూసుకుపోతున్ చైనా కంపెనీ షావోమి ఇటీవల టీవీ మార్కె‍ట్‌పై  కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో సరసమైన ధరల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ  ఎంఐ స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది.   ఎంఐ టీవీ4 సిరీస్‌లో  తాజాగా 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ , ఏఐ ఆధారిత ఎంఐ టీవీ4ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. 

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌,  డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్  ప్రధాన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  సుమారు రూ.63,300 దీని ధరను నిర్ణయించింది. అయితే బారత మార్కెట్‌లో ఈ టీవీని ఎపుడు లాంచ్‌ చేసేదీ  స్పష్టత లేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top