’చపలచిత్త’ ట్రంప్‌తో అమెరికాలో పెట్టుబడులకు అవకాశాలు: ఆనంద్‌ మహీంద్రా | Sakshi
Sakshi News home page

’చపలచిత్త’ ట్రంప్‌తో అమెరికాలో పెట్టుబడులకు అవకాశాలు: ఆనంద్‌ మహీంద్రా

Published Sat, Feb 18 2017 3:49 AM

’చపలచిత్త’ ట్రంప్‌తో అమెరికాలో పెట్టుబడులకు అవకాశాలు: ఆనంద్‌ మహీంద్రా - Sakshi

ముంబై:  ’చపలచిత్తం’ గల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో అమెరికాలో ఇన్వెస్ట్‌ చేయడానికి మరిన్ని వ్యాపార అవకాశాలు తెరపైకి వచ్చాయని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. అమెరికాలో తమ పెట్టుబడులను రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.

‘నిజానికి ఆయన ప్రకటించిన మేక్‌ అమెరికా గ్రేట్‌ విధానంతో పెట్టుబడులకు కేంద్రంగా అమెరికా మరోసారి నిలవనుంది. స్టాక్‌మార్కెట్లు ఇప్పటికే పెరిగాయి. అక్కడ అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని విశ్వసిస్తున్నందున మేం అమెరికాలో పెట్టుబడులను రెట్టింపు చేయనున్నాం‘ అని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement