ఆరోగ్య, జీవిత బీమా ఒకే పాలసీలో.. | Star Health, IndiaFirst Life Insurance join hands to offer combi plans | Sakshi
Sakshi News home page

ఆరోగ్య, జీవిత బీమా ఒకే పాలసీలో..

Jul 4 2016 12:36 AM | Updated on Sep 4 2017 4:03 AM

ఆరోగ్య, జీవిత బీమా ఒకే పాలసీలో..

ఆరోగ్య, జీవిత బీమా ఒకే పాలసీలో..

ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను విడివిడిగా తీసుకునే ఇబ్బందిని తప్పిస్తూ రెండు రకాల ప్రయోజనాలతో కూడిన కాంబినేషన్....

ముంబై: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను విడివిడిగా తీసుకునే ఇబ్బందిని తప్పిస్తూ రెండు రకాల ప్రయోజనాలతో కూడిన కాంబినేషన్ పాలసీలను తీసుకొచ్చేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు కలిపాయి. స్టార్ ఫస్ట్ కాంబి ప్లాన్ కింద స్టార్ ఫస్ట్ కాంప్రహెన్సివ్, స్టార్ ఫస్ట్ క్లాసిక్, స్టార్ ఫస్ట్ కేర్, స్టార్ ఫస్ట్ డిలైట్, స్టార్ ఫస్ట్ ఆప్టిమా పేరుతో మొత్తం ఐదు రకాల పాలసీలను తీసుకురానున్నాయి.

ఈ పాలసీల్లో జీవిత బీమా కవరేజీ రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు లభిస్తుంది.అలాగే, ఆరోగ్య బీమా కవరేజీ రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు ఎంచుకోవచ్చు. ఆరోగ్య బీమా కవరేజీ వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా తీసుకునే సౌలభ్యం ఉంది. 400కుపైగా రోజువారీ చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. ఏడాదిలో క్లెయిమ్‌లు లేకుంటే 100 శాతం వరకు బోనస్, ఔట్ పేషెంట్ విభాగంలో తీసుకునే దంత, కంటి వైద్య చికిత్సలకు, ప్రసవం, శిశువులకు కూడా కవరేజీ లభిస్తుంది. ఇందులో ఉన్న మరో సౌలభ్యం ఏమిటంటే ఆరోగ్య బీమా కవరేజీ మొత్తం ఖర్చయిపోతే... తిరిగి దానంతట అదే కవరేజీ 100 శాతం వరకు పునరుద్ధరించబడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement