లాభాల శుభారంభం: ఐటీ డౌన్‌ | Sakshi
Sakshi News home page

లాభాల శుభారంభం: ఐటీ డౌన్‌

Published Fri, Sep 14 2018 9:34 AM

Sensex gains over 300 pts to reclaim 38,000 level - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి.ఆరంభంలోనే 300పాయింట్లుకు పైగా లాభపడి 38వేల స్థాయిని అధిగమించింది. అటు నిఫ్టీ కూడా 11,450   స్థాయిని తాకింది. అయితే లాభాలను తగ్గించుకున్నసెన్సెక్స్‌  ప్రస్తుతం 203 పాయింట్లు ఎగిసి 37,921 వద్ద, నిఫ్టీ 71పాయింట్ల లాభంతో11,440 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు ఐటీ సెక్టార్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎయిర్‌వేస్‌  షేర్లు భారీగా లాభ పడుతున్నాయి. వేదాంత, ఆర్‌సీఎఫ్‌, సన్‌ఫార్మ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, మారుతి, యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ విప్రో నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement