వైరల్‌ అవుతున్న రోల్స్‌ రాయిస్‌ ట్యాక్సీ | Rolls Royce Taxi Viral In Social Media | Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతున్న రోల్స్‌ రాయిస్‌ ట్యాక్సీ

Mar 5 2020 7:28 PM | Updated on Mar 5 2020 8:33 PM

Rolls Royce Taxi Viral In Social Media  - Sakshi

సోషల్‌ మీడియాలో పాత తరం రోల్స్ రాయిస్‌ కారు ప‍్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కారు మోటార్‌ రేసింగ్‌ ఔత్సాహికులకు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. పసుపు(గోల్డెన్‌) నెంబర్‌ ప్లేట్‌తో ప్రయాణిస్తున్నట్టుగా ఉన్న రాయిస్‌ కారు ఫోటో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేరళకు చెందిన బాబీ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. బంగారు రంగులో ఉన్న ఆ కారును అతడు ఓ ప్రైవేటు రిసార్టుకు అద్దెకిచ్చాడు. ఆ రిసార్టులో దిగే వాళ్లు ఎవరైన దీన్ని బుక్ చేసుకుంటే పికప్, డ్రాప్ కోసం రోల్స్ రాయిస్‌లో ప్రయాణించే అవకాశం కల్పించాడు. 25,000 చెల్లిస్తే ఈ ప్యాకేజీలో 300 కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా రెండుమూడు రోజులు వరకు ఉంచుకోవచ్చని యజమాని చెబుతున్నాడు. సోషల్‌ మీడియాలో ఈ కారుకు సంబంధించి నెటిజన్లు స్పందించారు. ఈ కారులో ఏ విధమైన మీటర్‌ను అమర్చారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా, మరోవైపు ఈ కారును ట్యాక్సీగా ఉపయోగించడానికి కారణం ఏంటని మరో నెటిజన్‌ ప్రశ్నలు సంధించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement