ఓలా డ్రైవర్లకు ఎస్‌బీఐ కారు లోన్లు! | Ola, SBI tie up for 'daily repayment' car loans to drivers | Sakshi
Sakshi News home page

ఓలా డ్రైవర్లకు ఎస్‌బీఐ కారు లోన్లు!

Feb 28 2015 3:12 AM | Updated on Aug 28 2018 8:04 PM

ఓలా డ్రైవర్లకు ఎస్‌బీఐ కారు లోన్లు! - Sakshi

ఓలా డ్రైవర్లకు ఎస్‌బీఐ కారు లోన్లు!

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా కంపెనీ తమ కారు డ్రైవర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

రోజూవారీ చెల్లింపులతో..
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా కంపెనీ తమ కారు డ్రైవర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) సహకారంతో ‘ఓలా ప్రగతి’ పేరుతో డ్రైవర్లకు కార్‌లోన్ తీసుకునే సౌకర్యాన్ని కలిగించింది. అది కూడా రోజువారీ చెల్లింపులతోనే అని ఎస్‌బీఐ సీజీఎం రజిని మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద లోన్‌కు అర్హులైన వారు 10 శాతం డౌన్ పేమెంట్ తో కార్‌ను సొంతం చేసుకోవటే కాకుండా కేవలం 24 గంటల్లోనే రుణాలు మంజూరవుతాయని పేర్కొన్నారు.

సగటు వడ్డీ రేటు 13 శాతంగా నిర్ణయించినట్లు చెప్పారు. ‘‘డ్రైవర్లకు నెలసరి వాయిదాలు (ఈఎంఐ) చెల్లింపులంటే భారంగా ఉంటుంది. అందుకే వారి కోసం రోజూ వారీ చెల్లింపు పథకాన్ని ప్రారంభించినట్లు ఓలా వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రణయ్ జివరజ్కా ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో సుమారు లక్షమంది డ్రైవర్లు సొంతంగా కారును కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారాయన.

Advertisement
 
Advertisement
Advertisement