ఇక సినిమా థియేటర్లలో సెబీ ప్రచారం | Movie theaters in SEBI campaign | Sakshi
Sakshi News home page

ఇక సినిమా థియేటర్లలో సెబీ ప్రచారం

May 2 2016 1:00 AM | Updated on Aug 9 2018 7:30 PM

ఇక సినిమా థియేటర్లలో సెబీ ప్రచారం - Sakshi

ఇక సినిమా థియేటర్లలో సెబీ ప్రచారం

ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సినిమా థియేటర్లు...

ఆర్థిక అంశాలపై అవగాహన పెంపే లక్ష్యం
న్యూఢిల్లీ: ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సినిమా థియేటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృత ప్రచారం చేపట్టాలని యోచిస్తోంది. డబ్బా ట్రేడింగ్, అధిక రాబడులు ఆశచూపే పొంజీ స్కీమ్‌లు వంటి మోసపూరిత పెట్టుబడులపై అవగాహన కల్పించడమే ఈ ప్రచారం లక్ష్యం.

అంతేకాకుండా టీచర్లు, పోలీసు అధికారులు, ఇలా గ్రూపుల వారీగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా  యోచిస్తోంది.  ఈ ఆర్థిక సంవత్సరంలో టీవీ చానెళ్లు, రేడియో, వార్తాపత్రికలు తదితర మీడియా  మాధ్యమాల ద్వారా సెబీ ప్రచారం చేయనుంది. వీటితో పాటు సినిమా ప్రచారం, డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం ద్వారా మరింతమందికి అవగాహన కల్పించవచ్చని సెబీ భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement