వరుసగా రెండో రోజూ అమ్మకాలు | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో రోజూ అమ్మకాలు

Published Wed, Nov 8 2017 4:20 PM

Market sell-off continues, Sensex falls 152 pts      - Sakshi



సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండవ  రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌  బలహీనపడటంతో  అమ్మకాలు ఊపందుకుని మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.  ఆరంభంనుంచి  ఒడిదుడుకుల మధ్య  కదలాడిన మార్కెట్లలో  మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో కీలక సూచీలైన సెన్సెక్స్‌ 152 పాయింట్లు క్షీణించి 33,219 వద్ద,  నిఫ్టీ 47 పాయింట్ల  నష్టంతో 10,303 వద్ద స్థిరపడింది.   అక్టోబర్‌ 31 తరువాత ఇదే వీకెస్ట్‌ క్లోజింగ్‌గా నిలిచింఇ. ముఖ్యంగా  ప్రభుత్వ బ్యాంకులు, మెటల్‌ రంగాలలో పెరిగిన భారీ అమ్మకాలతో మార్కెట్లను బలహీనపర్చింది. నిన్న బాగా  నష్టపోయిన ఫార్మ ఈ రోజు పుంజుకోగా, ఐటీ కూడా లాభాల్లోనే ముగిసింది.

భారతీ  ఎయిర్‌ టెల్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇంకా వేదాంతా, టాటా మోటార్స్‌, యస్‌బ్యాంక్‌, లుపిన్‌, ఐసీఐసీఐ,  ఆర్‌ఐఎల్‌, హెచ్‌పీసీఎల్‌, హీరోమోటో, స్టేట్‌బ్యాంక్‌  నష్టాల్లో,  టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, సన్‌ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్ఎం, అరబిందో, ఇండస్‌ఇండ్, టీసీఎస్‌  లాభాల్లో ముగిశాయ.

Advertisement
Advertisement