ముంబై : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఎల్ఐసీ గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను కళ్లజూసింది. దేశీయ అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ఎల్ఐసీ గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై రూ.24,373 కోట్ల లాభాలార్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాల(రూ.21,257 కోట్ల)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం కంటే గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,328 కోట్లు తక్కువగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, లాభాలు 15 శాతం వృద్ధి సాధించడం విశేషం.
2013-14లో ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో రూ.54,330 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.47,002 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వివరాలను ఎల్ఐసీ చైర్మన్ ఎస్. కె. రాయ్ ఇటీవల పీటీఐకి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ 25 శాతానికి పైగా వృద్ధి సాధించడంతో ఈ స్థాయి రాబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల హోల్డింగ్స్‌తో ఎల్ఐసీ భారత స్టాక్ మార్కెట్లో అతి పెద్ద ఇన్వెస్టర్‌గా అవతరించింది. పలు బ్లూచిప్ షేర్లలో చెప్పుకోదగ్గ వాటా ఎల్ఐసీకి ఉంది. 30 కోట్ల మంది పాలసీదారులతో 17.7 లక్షల కోట్ల ఆస్తులతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీకి లాభాల పంట...
Published Mon, Aug 3 2015 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement