వేలంలోనే బొగ్గు కొనుక్కోండి.. | GVK to soon supply power from its first thermal plant in Punjab | Sakshi
Sakshi News home page

వేలంలోనే బొగ్గు కొనుక్కోండి..

Sep 14 2016 12:32 AM | Updated on Sep 4 2017 1:21 PM

వేలంలోనే బొగ్గు కొనుక్కోండి..

వేలంలోనే బొగ్గు కొనుక్కోండి..

పంజాబ్‌లోని గోయింద్వాల్ సాహిబ్ విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును ప్రత్యేక ఈ-వేలం ద్వారా కొనుగోలు చేసుకోవాలని జీవీకే పవర్‌కు అంతర్‌మంత్రిత్వ శాఖల బృందం సూచించింది.

జీవీకే ‘పంజాబ్’ ప్లాంటుకు కేంద్రం సూచన
హైదరాబాద్: పంజాబ్‌లోని గోయింద్వాల్ సాహిబ్ విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును ప్రత్యేక ఈ-వేలం ద్వారా కొనుగోలు చేసుకోవాలని జీవీకే పవర్‌కు అంతర్‌మంత్రిత్వ శాఖల బృందం సూచించింది. బొగ్గు సరఫరాకు సంబంధించిన అవగాహన ఒప్పందం గడువు ఈ ఏడాది జూన్ 30 నాటికే పూర్తయ్యిందని, దీన్ని పొడిగించబోవడం లేదని స్టాండింగ్ లింకేజ్ కమిటీ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గోయింద్వాల్ సాహిబ్ వద్ద ఏర్పాటైన 540 మె.వా. థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనిట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 6న, యూనిట్ 2 ఏప్రిల్ 16న అందుబాటులోకి వచ్చాయి. అయితే, యూనిట్ 1లో బొగ్గు లభ్యత లేకపోవడం వల్ల ఏప్రిల్ 22 నుంచి ఉత్పత్తి నిల్చిపోయింది. ప్లాంటు నిరుపయోగంగా పడి ఉన్నందున బొగ్గు సరఫరా కల్పించాలంటూ జీవీకే కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement