విప్రోపై అమెరికాలో ‘క్లాస్‌ యాక్షన్‌’ దావా | Five former employees file case against Wipro | Sakshi
Sakshi News home page

విప్రోపై అమెరికాలో ‘క్లాస్‌ యాక్షన్‌’ దావా

Apr 28 2020 1:47 AM | Updated on Apr 28 2020 1:47 AM

Five former employees file case against Wipro - Sakshi

వాషింగ్టన్‌: ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం విప్రోపై అమెరికాలో అయిదుగురు ఉద్యోగుల బృందం క్లాస్‌ యాక్షన్‌ దావా వేసింది. దక్షిణాసియా, భారతీయ మూలాలున్న వారికే ప్రాధాన్యమిస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దాఖలు చేసిన కేసులో ఆరోపించింది. మొత్తం అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12% కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80% మంది ఉన్నారని (ప్రధానంగా భారతీయులు) ఉద్యోగుల బృందం పేర్కొంది. కోర్టులో వ్యాజ్యం ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించబోమని విప్రో తెలిపింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement