స్టార్ట్‌అప్ విలేజెస్‌కి బ్లాక్‌బెర్రీ సపోర్ట్ | BlackBerry Passport in stores from Friday | Sakshi
Sakshi News home page

స్టార్ట్‌అప్ విలేజెస్‌కి బ్లాక్‌బెర్రీ సపోర్ట్

Oct 10 2014 1:19 AM | Updated on Jun 2 2018 3:08 PM

స్టార్ట్‌అప్ విలేజెస్‌కి బ్లాక్‌బెర్రీ సపోర్ట్ - Sakshi

స్టార్ట్‌అప్ విలేజెస్‌కి బ్లాక్‌బెర్రీ సపోర్ట్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్న స్టార్ట్‌అప్ విలేజ్‌లతో కలిసి పనిచేయడానికి బ్లాక్ బెర్రీ ఉత్సాహం చూపిస్తోంది.

ఎగ్జిక్యూటివ్స్ కోసం ‘పాస్‌పోర్ట్’ స్మార్ట్‌ఫోన్ రూ. 49,990

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్న స్టార్ట్‌అప్ విలేజ్‌లతో కలిసి పనిచేయడానికి బ్లాక్ బెర్రీ ఉత్సాహం చూపిస్తోంది. ‘టిహబ్’ పేరుతో తెలంగాణలోను, ఆంధప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న స్టార్ట్‌అప్ విలేజీల్లో పనిచేసే డెవలపర్స్‌కి కావల్సిన సాంకేతిక సహకారాన్ని అందించడానికి సిద్థంగా ఉన్నట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా డెరైక్టర్ అన్ని మాథ్యూ తెలిపారు. కొచ్చిన్ స్టార్ట్‌అప్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన రూబస్ ల్యాబ్ విధానంలోనే తెలుగు రాష్ట్రాల్లో అడుగులు వేయనున్నట్లు ఆమె తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ప్రత్యే కించి ఎగ్జిక్యూటివ్‌లకు బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ ‘పాస్‌పోర్ట్’ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. దీని ధర రూ.49,900.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement