ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మొ–క్యాష్‌ | app ki khani | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మొ–క్యాష్‌

Feb 5 2018 1:55 AM | Updated on Aug 20 2018 2:35 PM

app ki khani - Sakshi

డబ్బులు అత్యవసరమా? అయితే ఇంకేం తక్షణమే పొందండి. అదేలా అనుకుంటున్నారా? ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మొ–క్యాష్‌ మొబైల్‌ యాప్‌ సాయంతో. ఇన్‌స్టంట్‌ లోన్, క్రెడిట్‌ కార్డు ఫీచర్ల అనుసంధానంతో బ్యాంక్‌ ఈ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

ప్రత్యేకతలు...
ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌: కేవలం మూడు నిమిషాల్లో క్రెడిట్‌ లిమిట్‌ను తెలుసుకోవచ్చు.  
 క్రెడిట్‌ లిమిట్‌లో ఎంత అవసరమో అంతే వాడుకోవచ్చు. ఈ విధంగా రుణంగా తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అంటే క్రెడిట్‌ లిమిట్‌ రూ.5,00,000 ఉంటే దానిలో రూ.2,00,000 ఉపయోగించాం. అప్పుడు రూ.2 లక్షలను వడ్డతో సహా చెల్లించాలి.  
ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు డబ్బుల్ని బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. మొత్తం 100 శాతం క్రెడిట్‌ లిమిట్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు పంపుకోవచ్చు.  
రుణాన్ని తిరిగి సరళమైన ఈఎంఐల రూపంలో చెల్లించొచ్చు.
క్రెడిట్‌ కార్డు కూడా పొందొచ్చు. దీన్ని రిటైల్, ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్‌ ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా కస్టమర్లకు పలు ప్రయోజనాలను, ఆఫర్లను అందిస్తోంది.  

గమనిక:  ఉద్యోగం చేసేవారు, స్వయం ఉపాధి పొందేవారు ఈ సేవలు పొందడానికి అర్హులు. నెలవారీజీతం రూ.25,000కు పైన ఉండాలి. 

Advertisement
 
Advertisement
Advertisement