గ్రహం అనుగ్రహం (06-12-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (06-12-2019)

Published Fri, Dec 6 2019 6:02 AM

Daily Horoscope in Telugu (06-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువుమార్గశిర మాసం, తిథి శు.దశమి తె.5.09 వరకు (తెల్లవారితే శని వారం), నక్షత్రం ఉత్తరాభాద్ర రా.10.27 వరకు, తదుపరి, రేవతి
వర్జ్యం ఉ.6.30 నుంచి 8.14 వరకు, దుర్ముహూర్తం ఉ.8.31నుంచి 9.15 వరకు, తదుపరి ప.12.11 నుంచి 12.55 వరకుఅమృతఘడియలు... సా.5.06 నుంచి 6.54 వరకు.

సూర్యోదయం :    6.20
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ధనవ్యయం. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కర్కాటకం: బంధువర్గంతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. ఆరోగ్యభంగం. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతా యి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధ ్డన, వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యా పారాలు లాభసాటిగా ఉంటాయి. ఉ ద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

తప్పక చదవండి

Advertisement