జననేతకు అడుగడుగునా జన నీరాజనం | Sakshi
Sakshi News home page

జననేతకు అడుగడుగునా జన నీరాజనం

Published Mon, Nov 13 2017 1:26 PM

YS Jagan PrajaSanKalpaYatra continuous at Mydukur constituency - Sakshi

సాక్షి, దువ్వూరు : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ...అశేష ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తలు,అభిమానుల ఉత్సాహం నడుమ ముందుకు కొనసాగుతోంది.  మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు నుంచి ఏడో రోజు పాదయాత్రను ఆయన మొదలుపెట్టారు.  దారి పొడవునా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.

ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు మహిళలు పోటెత్తారు.  తమ సమస్యలు చెప్పుకునేందుకు ఉత్సాహం చూపించారు. జొన్నవరం గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న  మహిళలు సైతం రాజన్న బిడ్డ రాకను తెలుసుకుని కలిసేందుకు పరుగులు తీశారు. గ్రామాల్లో  బెల్ట్‌ షాపులను అరికట్టాలని కోరారు.  మద్యం దుకాణాల వల్ల తమ  కుటుంబాలు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన వైఎస్‌ జగన్‌....సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మూడు దశల్లో సంపూర్ణ మద్యనిషేధం అమలు అవుతుందని తెలిపారు.

అలాగే ఎన్కుపల్లి జంక్షన్‌లో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో.... ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపించింది.  ప్రజాసంకల్పయాత్రలో ఉన్నఆయనను కలిసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు. ఇక్కుపల్లిలో చాపాడు మండల రైతులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. సకాలంలో నీళ్లివ్వకపోవడంతో.... పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కూడా అమలు కాలేదని వివరించారు. సుమారు 50 వేల ఎకరాల పంట నష్టపోయామని వాపోయారు. వారి సమస్యలు విన్న ఆయన భవిష్యత్‌లో సకాలంలో నీళ్లు ఇచ్చేందుకు బ్రహ్మసాగరం ప్రాజెక్ట్‌ను స్థిరీకరిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ హామీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ను జొన్నవరంలో బద్వేల్ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ సీపీ బూత్‌ కమిటీ సమన్వయకర్తలు, సభ్యులు కలిశారు. మైలవరం  నుంచి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌కు నీళ్లు, వంద కోట్లతో నియోజకవర్గ హామీతో పాటు మొత్తం   మూడు ప్రధాన సమస్యలను వివరించారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్‌ జగన్‌...సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి మూడు, నాలుగు ప్రధాన  సమస్యలతో అసెంబ్లీ మ్యానిఫెస్టో  ప్రకటిస్తామన్నారు.

జననేత హామీపై.... బద్వేల్ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వైఎస్‌ఆర్‌ కుటుంబంలో 40వేలమందిని చేర్చినందుకు వారికి వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. ఇక ఇక్కుపల్లి,  ఎన్కుపల్లి , జిల్లెల మీదుగా ఇడమడక వరకు సంకల్పయాత్ర కొనసాగుతోంది. కానగూడూరులో పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం....    జిల్లా బీసీ సంఘాల నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి  పాదయాత్ర కొనసాగించి.......రాత్రికి చాగలమర్రి సమీపంలో వైఎస్‌ జగన్ బస చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement