మా చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు..
తూర్పుగోదావరి :మా చిన్నారిని జగనన్న ఎత్తుకుని ముద్దాడారని విశాఖ జిల్లా కె.నాయుడుపాలెంకు చెందిన ఉప్పలరపు రాజషర్మేంద్ర తెలిపారు. పాదయాత్రలో భాగంగా తాటిపాక వెళుతున్న జగన్కు మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సులో ఉన్న రాజషర్మేంద్ర బస్సు కిటికీలోంచి ఏడాది వయస్సు గల కుమారుడు సాగర్కుమార్ను అందించగా ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడారు. జగనన్న మా అబ్బాయిని ఎత్తుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.