మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ | Woman raped by man in Nalgonda district, his escaped | Sakshi
Sakshi News home page

మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ

Mar 14 2015 9:32 PM | Updated on Sep 18 2019 3:24 PM

మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ - Sakshi

మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ

నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

నల్లగొండ: కీచకుల పరంపర కొనసాగుతోంది. మహిళలపై అకృత్యాలకు అదుపు లేకుండా పోతోంది. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement