బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళితే అడ్డుకుంటాం: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళితే అడ్డుకుంటాం: వైఎస్ జగన్

Published Tue, Feb 4 2014 4:03 PM

బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళితే అడ్డుకుంటాం: వైఎస్ జగన్ - Sakshi

న్యూఢిల్లీ: చరిత్రలో తొలిసారి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. విభజనను ఎదుర్కోనేందుకు విపక్షాలన్ని కలిసి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇదివరకే మేం జాతీయ పార్టీ నేతలను, రాజకీయ పార్టీలను కలిశాం. అపాయింట్ మెంట్ తీసుకుని అందర్ని కలుస్తాం అని అన్నారు.
 
బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళితే పోడియం వద్దే ఉండి అడ్డుకుంటాం అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎవరు దీక్ష చేసినా తాము మద్దతిస్తాం అని వైఎస్ జగన్ అన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు. 
 
సమైక్య నినాదంతోనే త్వరలో తెలంగాణలో పర్యటిస్తాను అని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో 5 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని వైఎస్ జగన్ తెలిపారు.  మాకు పార్టీలతో సంబంధం లేదు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారికే మా మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 
 

 

Advertisement
Advertisement