రాళ్లపాడు ప్రాజెక్ట్ ఐదు గేట్ల ఎత్తివేత | water release from rallapadu praject | Sakshi
Sakshi News home page

రాళ్లపాడు ప్రాజెక్ట్ ఐదు గేట్ల ఎత్తివేత

Nov 21 2015 9:32 AM | Updated on Sep 3 2017 12:49 PM

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్లవాగు జలాశయానికి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

లింగసముద్రం: ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్లవాగు జలాశయానికి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం ఐదు గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయడం ప్రారంభించారు. ఇన్‌ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో భారీగా ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తతో ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement