హంద్రీనీవా నుంచి నీటి విడుదల | water release from handri neeva project | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా నుంచి నీటి విడుదల

Oct 16 2015 2:29 PM | Updated on Sep 26 2018 6:21 PM

కర్నూలు జిల్లా పత్తికొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి పందికోన రిజర్వాయర్‌కు శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేశారు.

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి పందికోన రిజర్వాయర్‌కు శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేశారు. 300 క్యూసెక్కుల నీటిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కలెక్టర్ మోహన్ విడుదల చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీరు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన రిజర్వాయర్‌కు చేరనుంది. దీంతో కోడుమూరు, దేవరకొండ, గోనెగండ్ల, ఢోన్ తదితర ప్రాంత ప్రజలకు తాగు నీటిని అందించడానికి వీలవుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement