లంకల్లో పోలీసుల తనిఖీలు | Unusual activities In Krishna River Lanka Area | Sakshi
Sakshi News home page

లంకల్లో పోలీసుల తనిఖీలు

Oct 29 2018 1:48 PM | Updated on Apr 3 2019 8:54 PM

Unusual activities In Krishna River Lanka Area - Sakshi

లంకల్లో తనిఖీ చేస్తున్న పోలీసులకు కనిపించిన మద్యం సీసాలు

కృష్ణాజిల్లా, యనమలకుదురు (పెనమలూరు) : యనమలకుదురు కృష్ణా నది లంకల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడకు కొందరు వ్యక్తులు వచ్చి కోడి పందేలు, పేకాట, మద్యం సేవించి నదీ పరివాహక ప్రాంతంలో హడావుడి చేస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో ఆది వారం లంకల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేశా రు. యనమలకుదురు లంక కృష్ణా నది ఏటిపా య సమీప ప్రాంతం కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులకు అడ్డాగా మారింది. ఇక్కడ భారీగా కోడి పందేలు, పేకాట ఆడుతున్నారు.

లంకల్లోకి పోలీ సులు తనిఖీలకు వస్తే సమాచారం ఇచ్చేందు కు పేకాటరాయుళ్లు నది ఒడ్డున ఇన్‌ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులు వస్తున్న సమాచారం తెలియగానే తప్పించుకుంటున్నారు. కాగా ఆదివారం కూడా లంకల్లో పేకాట, కోడి పందేలు ఆడుతున్నారని సమాచారం రావటంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సమాచారం మందుగానే తెలుసుకున్న జూదరులు తప్పించుకున్నారు. అయితే పోలీసుల తనిఖీల్లో భారీగా మద్యం ఖాళీ బాటిల్స్‌ కనిపించటంతో కంగుతిన్నారు. ఇకపై ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని సీఐ దామోదర్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement