గుప్తనిధుల కోసం తవ్వకాలు | Treasure excavations in Kaligiri | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Sep 8 2015 8:08 PM | Updated on Sep 3 2017 9:00 AM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులకు పట్టుబడ్డారు.

కలిగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులకు పట్టుబడ్డారు. వీర్నకల్లు గ్రామ చెరువులో మంగళవారం రాత్రి తవ్వకాలు జరుపుతున్న ముగ్గురు వ్యక్తుల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కాగా తాము మొత్తం ఏడుగురమని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నామని వారు విచారణలో వెల్లడించారు. దీంతో మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుబడిన వారిలో ఇదే మండలానికి చెందిన శ్రీరాములు, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement