11 మంది సీపిఐఎమ్‌ఎల్‌ న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్ | The arrest of 11 people CPIML nyudemokrasi | Sakshi
Sakshi News home page

11 మంది సీపిఐఎమ్‌ఎల్‌ న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్

Dec 16 2014 6:04 AM | Updated on Aug 21 2018 5:46 PM

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రేగులకుంట వద్ద 11 మంది సీపిఐఎమ్‌ఎల్ న్యూడెమొక్రసీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు.

పశ్చిమ గోదావరి జిల్లా: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం పడమర రేగులకుంటలో 11 మంది సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జల్లేరు వాగు వద్ద సమావేశమయ్యారనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి 8 తుపాకులు,బుల్లెట్లు ,మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారు చంద్రన్న ,అశోక్ వర్గాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement