'అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు' | tdp condemns arrest of mla venkata veeraiah | Sakshi
Sakshi News home page

'అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు'

Jul 6 2015 7:12 PM | Updated on Aug 11 2018 2:53 PM

తమ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును తెలుగు దేశం పార్టీ నాయకులు ఖండించారు.

తమ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును తెలుగు దేశం పార్టీ నాయకులు ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తోందని అన్నారు. అసలు ఈ కేసుతో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధం లేకపోయినా ఆయనపై ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని ఆరోపించారు.

సండ్ర వెంకట వీరయ్యను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు విచారించిన తర్వాత ఏసీబీ వర్గాలు ఆయనను అరెస్టు చేశాయి. ఆయన అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement