'పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం' | sujana chowdary statement on pawan kalyan | Sakshi
Sakshi News home page

'పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం'

Jul 7 2015 5:10 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం' - Sakshi

'పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం'

జనసేన పార్టీ అధ్యక్షుడు.. సినీనటుడు పవన్ కల్యాణ్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు.

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు.. సినీనటుడు పవన్ కల్యాణ్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎంపీలు పనితీరును నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.

వ్యాపార వేత్తలు రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడా రాజ్యాంగంలో లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సోమవారం ప్రెస్ మీట్లో 'ఆంధ్ర ఎంపీలు వ్యాపారం చేస్తున్నారు. పార్లమెంటులో గోడలు చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారు..' అన్న సంగతి తెలిసిందే.  దానికి కౌంటర్గా సుజనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement