శిరిడి సాయి ఫస్ట్‌లుక్‌ విడుదల | Shirdi Sai Movie First Look Released | Sakshi
Sakshi News home page

శిరిడి సాయి ఫస్ట్‌లుక్‌ విడుదల

Dec 2 2018 9:36 AM | Updated on Dec 2 2018 9:36 AM

Shirdi Sai Movie First Look Released - Sakshi

సాక్షి బెంగళూరు: ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా ఫస్ట్‌ లుక్‌ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ పి.సునీల్‌ కుమార్‌ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సినిమాలో శిరిడి సాయిబాబాగా మచ్చా రామలింగారెడ్డి(ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు) నటిస్తున్నారు. ప్రముఖ నటీనటులు సీత, భానుచందర్, విజేత, సతీశ్, నాగకర్, రజనీ, శశికళ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఉభయ భాషల్లో వస్తున్న శిరిడి సాయిబాబా చిత్రం విజయవంతం కావాలని, ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఈ సినిమా ఒక అనుభూతి ఇవ్వాలని సీపీ ఆకాంక్షించారు. 

రామలింగారెడ్డి మాట్లాడుతూ కన్నడలో ఆడియో ఫంక్షన్‌ ఈ నెలలోనే బెంగళూరులో నిర్వహిస్తామన్నారు. భక్తుల అనుభవాలతో పాటు సాయిబాబా లీలలను ఈ చిత్రంలో చూపించినట్లు దర్శకుడు సత్యం తెలిపారు. కోడైరెక్టర్‌ రవిరాజ్, నిర్మాతలు వెంకట్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement