ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ | Retired IPS as AP Home dept Advisor | Sakshi
Sakshi News home page

ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌

May 5 2017 8:43 PM | Updated on Sep 5 2017 10:28 AM

ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌

ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌

ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్‌ ఐపీఎస్ కోడె దుర్గా ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: ఏపీ హోంశాఖ సలహాదారుగా రిటైర్డ్‌ ఐపీఎస్ కోడె దుర్గా ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళిక అమలుపై హోంశాఖకు దుర్గాప్రసాద్ సలహాలు ఇవ్వనున్నారు. 1981 బ్యాచ్‌ ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ అధికారి అయిన కోడె దుర్గా ప్రసాద్‌ 2011 నవంబర్‌లో ఎస్‌పీజీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. అంతకు ముందు విశాఖపట్టణం పోలీస్‌ కమిషనర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పలు బాధ్యతలు నిర్వహించారు. కొద్ది కాలం రాష్ట్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా కూడా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement