రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారు దగ్ధం | Ramreddy Venkata Reddy Escapes from Accident | Sakshi
Sakshi News home page

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారు దగ్ధం

Sep 9 2013 3:37 AM | Updated on Apr 3 2019 7:53 PM

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారు దగ్ధం - Sakshi

రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారు దగ్ధం

రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

భువనగిరి, న్యూస్‌లైన్: రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెం చౌరస్తావద్ద జాతీయ రహదారిపై రాత్రి 8.30గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. మంత్రితో పాటు ఆయన తమ్ముడు కృష్ణారెడ్డి, పీఏ నవీన్, డ్రైవర్ కృష్ణ, గన్‌మెన్‌లు ఎల్లయ్య, హరినారాయణ, రాంబాబు, సుబ్బారావులు కారులో ఉన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వెళ్తూ సింగన్నగూడెం వద్దకు రాగానే డ్యాష్‌బోర్డు నుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే కారాపి అందరూ కిందికి దిగారు. డ్రైవర్ కారు బోయ్‌నెట్‌నుఎత్తి వైర్లను సరిచేస్తుండగానే పెద్దఎత్తున మంటలు లేచాయి. డీజిల్‌ట్యాంకు పగిలిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement