ఆన్‌లైన్‌లో కోర్టు కేసుల సమాచారం | Online information on court cases | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో కోర్టు కేసుల సమాచారం

Jun 21 2015 2:55 AM | Updated on Sep 3 2017 4:04 AM

కోర్టు కేసుల సమాచా రాన్ని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని జిల్లా జడ్జి ఎంజే ప్రియదర్శిని తెలిపారు.

నంద్యాలటౌన్ : కోర్టు కేసుల సమాచా రాన్ని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని జిల్లా జడ్జి ఎంజే ప్రియదర్శిని తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆన్‌లైన్‌లో ఉన్న కోర్టు సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో జరిగే వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు.

కక్షిదారులు తమ కేసులకు సంబంధించి వాయిదా తేదీలను, తీర్పులను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.  కార్యక్రమంలో అదనపు సెషన్స్ జడ్జి మంగకుమారి, ప్రిన్సిపల్ సివిల్‌జడ్జి శైలజ, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి శేషాంజనేయులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement