రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One died in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Mar 31 2017 3:05 AM | Updated on Aug 30 2018 4:10 PM

మండలంలోని పెద్దూరులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక ఎస్‌ఐ ఎస్‌.హరిబాబునాయుడు గురువారం అందించిన వివరాలిలా వున్నాయి.

గరుగుబిల్లి : మండలంలోని పెద్దూరులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక ఎస్‌ఐ ఎస్‌.హరిబాబునాయుడు గురువారం అందించిన వివరాలిలా వున్నాయి. బుధవారం రాత్రి పెద్దూరు గ్రామానికి చెందిన తాబేలు శంకరరావు(26) గరుగుబిల్లి నుంచి తన స్వగ్రామమైన పెద్దూరు మోటారు సైకిల్‌పై వెళ్తున్న సమయంలో రాచప్ప చెరువు చివర ఉన్న కల్వర్టును బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకరరావు మృతితో తల్లి రవణమ్మ, తాత గంగయ్యలు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement