చెత్తకుప్పలో ఆడ శిశువు | Newborn baby found alive in dust bin | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో ఆడ శిశువు

Jun 18 2015 4:52 PM | Updated on Sep 3 2017 3:57 AM

చెత్తకుప్పలో ఆడ శిశువు

చెత్తకుప్పలో ఆడ శిశువు

రోజుల వయసున్న ఓ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో వదిలి వెళ్లారు.

విజయవాడ (కృష్ణా జిల్లా) :  రోజుల వయసున్న ఓ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో వదిలి వెళ్లారు. విజయవాడ బాలాజీ పేటలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శిశువును ఓ కవర్‌లో ఉంచి బాలాజీపేటలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న చెత్త కుప్పలో పడేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును.. శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement