అగ్గిపెట్టెలో శాలువాను సోనియాకు ఇచ్చిన పొన్నం | MP ponnam prabhakar presents shawl to sonia gandhi | Sakshi
Sakshi News home page

అగ్గిపెట్టెలో శాలువాను సోనియాకు ఇచ్చిన పొన్నం

Aug 15 2013 3:22 PM | Updated on Oct 22 2018 9:16 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్గిపెట్టెలో పట్టే శాలువాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహూకరించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్గిపెట్టెలో పట్టే శాలువాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహూకరించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతం చేనేతకు ప్రసిద్ధి అన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికులు గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీర కూడా నేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ తరహాలోనే ఇప్పుడు అగ్గిపెట్టెలో పట్టే శాలువాను తయారు చేయించి దాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పొన్నం ప్రభాకర్ బహూకరించారు.

కాగా, గతంలో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇచ్చారని, కానీ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటును అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement