సీఎం కిరణ్ను బర్తరఫ్ చేయాలి: పొన్నం | MP Ponnam Prabhakar Demands For CM Kiran Kumar Reddys Birth ruff | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ను బర్తరఫ్ చేయాలి: పొన్నం

Feb 16 2014 12:21 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ను బర్తరఫ్ చేయాలి: పొన్నం - Sakshi

సీఎం కిరణ్ను బర్తరఫ్ చేయాలి: పొన్నం

బహిష్కరణకు గురైన ఎంపీలతో సమావేశమైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే పార్టీ, సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

బహిష్కరణకు గురైన ఎంపీలతో సమావేశమైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే పార్టీ, సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్లో గొడవ సృష్టించడానికే సీమాంధ్ర ఎంపీలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. గురువారం కేంద్రప్రభుత్వం లోక్సభలో టి. బిల్లు ప్రవేశపెట్టింది. ఆ నేపథ్యంలో పలువురు ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

 

దాంతో సభను స్పీకర్ మీరాకుమార్ సోమవారానికి వాయిదా వేశారు. లోక్సభ తిరిగి రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు మళ్లి గొడవ చేసే అవకాశాలు ఉన్నాయని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్లో చోటు చేసుకున్న పరిణామాల అనంతరం సీమాంధ్రకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు సీఎం కిరణ్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement