కిరణ్కుమార్పై మంత్రి బాలరాజు ఫైర్ | Minister Balaraju takes on Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

కిరణ్కుమార్పై మంత్రి బాలరాజు ఫైర్

Nov 18 2013 1:53 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్కుమార్పై మంత్రి బాలరాజు ఫైర్ - Sakshi

కిరణ్కుమార్పై మంత్రి బాలరాజు ఫైర్

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మంత్రి పసుపులేటి బాలరాజు విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మంత్రి పసుపులేటి బాలరాజు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వివక్షత చూపుతోందని బాలరాజు ముఖ్యమంత్రిని విమర్శించారు. తన శాఖకు సంబంధించి తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
 
సొంత జిల్లా విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రచ్చబండ కార్యక్రమానికి కనీసం తనను ఆహ్వానించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. అదే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతుండగా, బాలరాజు కొంతకాలంగా సీఎంకు దూరంగా ఉంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement