ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. | love failure diprestion the ITI student Suicide | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..

Mar 23 2016 4:02 AM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. - Sakshi

ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..

తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న ఆవేదనతో మంగళవారం సాయంత్రం ఐటీఐ విద్యార్థి ....

ధర్మవరం అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న ఆవేదనతో మంగళవారం సాయంత్రం ఐటీఐ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. నార్పల మండలానికి చెందిన గణేష్ మండల కేంద్రం చెన్నేకొత్తపల్లిలోని తన పెద్దనాన్న రామాంజనేయులు వద్ద ఉంటూ ఐటీఐ చదువుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో ఉన్న తమ బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఇంట్లో ఉన్న విష రసాయన పదార్థాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement