‘మెంబర్‌ ఆఫ్‌ జన్మభూమి’ కారు హల్‌చల్‌ | Janmabhoomi Car Hulchul In East Godavari | Sakshi
Sakshi News home page

‘మెంబర్‌ ఆఫ్‌ జన్మభూమి’ కారు హల్‌చల్‌

Oct 22 2018 12:59 PM | Updated on Oct 22 2018 12:59 PM

Janmabhoomi Car Hulchul In East Godavari - Sakshi

మెంబర్‌ ఆఫ్‌ జన్మభూమి పేరుతో నగరంలో తిరుగుతున్న కారు నెంబర్‌ ప్లేట్‌పై రాసి ఉన్న ’మెంబర్‌ ఆఫ్‌ జన్మభూమి’ అక్షరాలు

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్, మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌..ఈ పదవులు అందరికీ తెలుసు. మరి ‘మెంబర్‌ ఆఫ్‌ జన్మభూమి’అన్న పేరు ఎప్పుడైనా చూశారా? నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ‘మెంబర్‌ ఆఫ్‌ జన్మభూమి’ పేరును కారు నెంబర్‌ ప్లేట్‌పై రాసుకుని హల్‌చల్‌ చేస్తుండటంతో నగరవాసులు విస్తుపోతున్నారు. పిచ్చిముదురు పాకాన పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీకి చెందిన సాధారణ జన్మభూమి కమిటీ సభ్యులు.. ఆ పదవిని ఉన్నత హోదాగా భావించుకుని ఇలా తిరుగుతుండటంతో ఔరా! ఇదేమి చోద్యమంటూ అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement