హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వరా?: ఏవీ పటేల్‌ | is there no permission for even a PressMeet in Hyderabad, asks AV Patel | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వరా?: ఏవీ పటేల్‌

Dec 23 2013 10:26 AM | Updated on Sep 2 2017 1:53 AM

హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదనడంపై సమైక్యాంధ్ర గెజిటెడ్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు.

విశాఖపట్నం: హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదనడంపై సమైక్యాంధ్ర గెజిటెడ్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా తాము 15రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగాంగానే త్వరలో ఉద్యమ కార్యాచారణ సిద్ధం చేస్తున్నామని ఏవీ పటేల్ తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు తెలియకుండానే .. రాష్ట్ర విభజనకు సిద్దమవ్వడం దారుణమని ఏవీ పటేల్‌ పేర్కొన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement