భారీ వర్ష సూచన | heavy rain forecast to telangana, Andhra Pradesh | Sakshi
Sakshi News home page

భారీ వర్ష సూచన

Aug 23 2014 2:39 AM | Updated on Sep 2 2017 12:17 PM

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.

సాక్షి, విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలో చాలా చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల, కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాగల 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement