పెళ్లికి తెచ్చిన సొమ్ము బుగ్గిపాలు | Fire Accident In Farmer House Money Burnt | Sakshi
Sakshi News home page

పెళ్లికి తెచ్చిన సొమ్ము బుగ్గిపాలు

Nov 15 2018 1:44 PM | Updated on Nov 15 2018 1:44 PM

Fire Accident In Farmer House Money Burnt - Sakshi

పూరిల్లు కాలిపోవటంతో రోడ్డున పడిన భిక్షం, కస్తూరీబాయి దంపతులు

గుడ్లవల్లేరు (గుడివాడ) : ఒక రైతు కూలీ ఇంటో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమార్తె వివాహం కోసమని అప్పు తెచ్చిన సొమ్ము కాలి బూడిదైంది. వడ్లమన్నాడు దళితవాడలో బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో జంగం భిక్షంకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ నెలాఖరుకు జరగబోయే తమ కుమార్తె వివాహం కోసమని రూ.70 వేలను అప్పుగా తెచ్చి ఇంట్లో ఉంచామని బాధితులు భిక్షం, కస్తూరీబాయి దంపతులు వాపోయారు. అవి మంటల్లో కాలిపోయాయని కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లి ఎలా చేయాలని? ఆ అప్పు ఎలా తీర్చాలని ఆవేదనకు గురవయ్యారు. తాము పొలానికి వెళ్లినపుడు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వలన ఈ ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చేసరికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మంటల్లో వంట సామాన్లు, దుస్తులు కాలిపోయి బాధిత కుటుంబం కట్టుబట్టలతో రోడ్డు మిగిలింది. 

Advertisement
 
Advertisement
Advertisement