డీఎంహెచ్‌వోపై కలెక్టర్... కన్నెర్ర | erformance of the medical health officer of the district collector said | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌వోపై కలెక్టర్... కన్నెర్ర

Jul 28 2015 1:06 AM | Updated on Mar 21 2019 8:35 PM

డీఎంహెచ్‌వోపై కలెక్టర్...  కన్నెర్ర - Sakshi

డీఎంహెచ్‌వోపై కలెక్టర్... కన్నెర్ర

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పనితీరుపై కలెక్టర్ మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులందరూ ఉండగానే పట్టరాని కోపంతో

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పనితీరుపై కలెక్టర్ మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులందరూ ఉండగానే పట్టరాని కోపంతో ఫైలును నేలకేసి కొట్టారు. అర్ధంతరంగా సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో జిల్లా అధికారులంతా కంగుతిన్నారు.

ఇటీవల మచిలీపట్నంలో లింగనిర్ధారణ, అబార్షన్ ఘటనలో నిందితులపై కేసు పెట్టాలని తాను ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని కలెక్టర్ ప్రశ్నించగా, ఆయన పంపిన లేఖ తాను ఇంతవరకు చూడలేదని డీఎంహెచ్‌వో సమాధానమివ్వడమే ఆయన ఆగ్రహానికి కారణమని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement