డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree student commits suicide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Nov 24 2015 5:20 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అనంతపురం అర్బన్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని వేణుగోపాల్ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక వీరుగంటి వీధిలో నివాసముంటున్న నందిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement