ఘనంగా గోమాత వివాహం | cow wedding in vijayawada | Sakshi
Sakshi News home page

ఘనంగా గోమాత వివాహం

Nov 28 2017 11:01 AM | Updated on Nov 28 2017 11:01 AM

నగరంలోని సిద్దార్థానగర్‌లో గోమాత వివాహం వైభవంగా జరిగింది.

సాక్షి, విజయవాడ: నగరంలోని సిద్దార్థానగర్‌లో గోమాత వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి కుమార్తెగా అలంకరించిన గోమాలక్ష్మిని.. పెళ్లి కుమారుడిగా ముస్తాభైన నందీశ్వరుడికి ఇచ్చి పెద్దలు కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ వేడుకను తిలకించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. శాస్త్రోక్తంగా ఈ వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. గోమాలక్ష్మిని పసుపు పారాణిలతో నుదుట కళ్యాణ తిలకం, పచ్చని బాసికం, పట్టు వస్త్రాలతో అలంకరించారు.

ఇక వరుడు నందీశ్వరుడు చిరుగంటల మాలలు, పూల హారాలతో పెళ్లికి తరలివచ్చాడు. అనంతరం గోమాత, నందీశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నట్లు వీరి వివాహానికి ముందుగానే శుభలేఖలను కూడా అచ్చు వేయించి మరీ పంపిణీ చేశారండోయ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement