హత్యచేసి తలతీసుకెళ్లారు | Carried by assassinating the head | Sakshi
Sakshi News home page

హత్యచేసి తలతీసుకెళ్లారు

May 12 2015 4:14 AM | Updated on Jul 30 2018 8:29 PM

హత్యచేసి తలతీసుకెళ్లారు - Sakshi

హత్యచేసి తలతీసుకెళ్లారు

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ పినకిల్తారి గ్రామానికి చెందిన వంజరి పోతురాజు

జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ పినకిల్తారి గ్రామానికి చెందిన వంజరి పోతురాజు (45) ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని హత్య చేసినవాళ్లు తలను నరికి తీసుకెళ్లారు. జి.మాడుగుల-నర్సీపట్నం రోడ్డులో పినకిల్తారి,పెదకిల్తారి జంక్షన్ కర్రిమామిడి వద్ద ఈ మొండేన్ని సోమవారం ఉదయం కనుగొన్నారు.

పోతురాజుకు ఇంకా పెళ్లి కాలేదు. మద్యం తాగే అలవాటు ఉంది. అన్నయ్య కొడుకు వంజరి నాయుడుతో కలసి జీవిస్తున్నాడు. రోజూ గ్రామంలో ఎవరో ఒకరి ఇంటి వద్ద నిద్రపోతుంటాడని తెలుస్తోంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement